Saturday, September 25, 2010

బఠాణీ పరోటా

కావలసినవి:

మైదాపిండి: 3 కప్పులు, నెయ్యి: 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు: అర టీ స్పూను, నెయ్యి: వేయించడానికి సరిపడా.

స్టఫింగ్ కోసం: ఉడికించిన పచ్చి బఠాణీలు: 2 కప్పులు, పచ్చిమిర్చి: 5, జీలకర్ర: టీ స్పూను, నెయ్యి: టేబుల్ స్పూను, ఉప్పు: తగినంత.24ruchi2

తయారుచేయు విదానం:

ముందుగా ఉడికించిన బఠాణీలను మెత్తగా మెదపాలి.

ఓ బాణలి లో కొద్దిగా నెయ్యి వేసి జీలకర్ర వేసి వేయించాలి.

తరవాత తురిమిన పచ్చిమిర్చి, మేదిపిన బఠాణీ ముద్ద వేయాలి. ఉప్పు కూడా వేసి ఓ నిమిషం ఉడికించి చల్లారనివ్వాలి.

మైదాలో ఉప్పు, నెయ్యి వేసి కలపాలి. తరవాత తగినన్ని నీళ్ళు పోసి మెత్తగా కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి.

ఇప్పుడు ఒక్క ఉండలో టేబుల్ స్పూను చొప్పున చల్లారిన బఠాణీ మిశ్రమాన్ని పెట్టి అంచుల్ని మూసేసి గుండ్రంగా వత్తాలి. తరవాత నాన్ స్టిక్ పాన్ మీద వేసి తగినంత నెయ్యి వేస్తూ రెండు వైపులా కాల్చి తీయాలి.

ఇలాగే అన్నీ చేస్తే బఠాణీ పరాటా రెడీ.

No comments:

Post a Comment