Saturday, September 4, 2010

‌నవరతన్ కూర్మా

కావలసినవి:

కూరగాయల ముక్కలు (క్యారెట్,బటానీ,బంగాళాదుంపలు,క్యాలీఫ్లవర్): రెండు కప్పులు, ఉల్లిపాయలు : రెండు, అల్లం వెల్లుల్లి: రెండు టీ స్పూన్లు, పసుపు: అర టీ స్పూను, ధనియాల పొడి: రెండు టీ స్పూన్లు,  కారం: ఒకటిన్నర టీ స్పూన్లు, గరం మసాల: ఒకటిన్నర టీ స్పూన్లు, పాలు:కప్పు, మీగడ: రెండు టేబుల్ స్పూన్లు, నెయ్యి: మూడు టేబుల్ స్పూన్లు, ఉప్పు: తగినంత, పన్నీర్:100 గ్రా., ట24ruchi3మాటో గుజ్జు: 3 టేబుల్ స్పూన్లు, డ్రై ఫ్రూట్స్(జీడిపప్పు,బాదం పప్పు,కిస్మిస్): 4 టీ స్పూన్లు, పైనాపిల్ ముక్కలు: 5 టేబుల్ స్పూన్లు.

తయారుచేయు విదానం:

  • ఉల్లిపాయల్ని సన్నగా తురుమాలి.
  • కూరగాయ ముక్కల్ని ఉడికించి ఉంచాలి.
  • పైనాపిల్ ముక్కల్ని కూడా మెత్తగా చేసి ఉంచాలి.
  • ఒక నాన్ స్టిక్ పాన్ ను తీసుకుని నెయ్యి వేసి చదరపు ముక్కలుగా కోసి ఉన్న పన్నీర్ ను వేసి ఎర్రగా వేయించి పక్కన ఉంచాలి.
  • అందులోనే ఉల్లి ముక్కలు, అల్లం వెల్లుల్లి ముక్కలు వేసి తక్కువ మంటమీద వేయించాలి.
  • తరువాత టమాటో గుజ్జు, పసుపు, దనియాల పొడి, కారం, గరం మసాల పొడి,  ఉప్పు వేసి తగినాన్ని నీళ్ళు పోసి ఉడికించాలి.అది ఉడికి మంచి వాసన వస్తుండగా ఉడికించిన కూరగాయ ముక్కల్ని వేసి దగ్గరగా అయ్యే వరకు ఉడికించాలి.
  • ఇపుడు పాలు, మీగడ వేసి మరో నిమిషం ఉడికించాలి. చివరగా దించే ముందు వేయించిన పన్నీర్ ముక్కలు, డ్రై ఫ్రూట్స్, పైనాపిల్ గుజ్జు,కొత్తి మీర వేసి దించాలి.

No comments:

Post a Comment