కావలసినవి : మొక్కజొన్న పిండి(గింజల్ని ఎండపెట్టి మిల్లు పట్టినది): అరకిలో, గోధుమ పిండి: పావుకిలో, పెరుగు: నాలుగు టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి: ౩, పచ్చిమిర్చి:నాలుగు, అల్లం: చిన్న ముక్క, పసుపు: పావు టీ స్పూను, కారం: పావు టీ స్పూను, ఉప్పు: తగినంత, మిర్యాల పొడి:అర టీ స్పూను, నూనె: వేయించడానికి సరిపడా.
తయారుచేయు విధానం:
మొక్కజొన్న పిండినీ,గోధుమ పిండినీ కలపాలి.
వెల్లులి, అల్లం సన్నగా తరగాలి.
తరువాత అన్ని దినుసులనూ పిండి మిశ్రమంలో కలిపి తగినన్ని నీళ్ళు చల్లి చపాతీ పిండిలా చెయ్యాలి.
ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలి.
ఇప్పుడు నాన్ స్టిక్ పాన్ మీద కొన్ని చుక్కల నూనె వేసి పాన్ అంతా రాయాలి. దాని మీద ఈ ఉండను పెట్టి చేత్తో మెల్లగా చఫాతీ సైజులో వత్తుకోవాలి. తరువాత పాన్ ను స్టవ్ మీద పెట్టి చఫాతీ ని రెండువైపులా కాల్చి తీయాలి.ఇలాగే అన్నీ చేసుకోవాలి.
No comments:
Post a Comment