Saturday, September 25, 2010

పన్నీర్ బట్టర్ మసాలా

కావలసినవి:

పన్నీర్: 200 గ్రా.. ఉల్లిపాయ: ఒకటి,టొమాటోలు: నాలుగు, అల్లం: చిన్న ముక్క, వెల్లుల్లి: నాలుగు రెబ్బలు, పుదీనా ఆకులు: పది, పచ్చిమిర్చి: నాలుగు, యాలకులు: ఒకటి, లవంగాలు: రెండు, వెన్న: రెండు టేబుల్ స్పూన్లు.

24ruchi4తయారుచేయు విదానం:

పాన్ లో వెన్న వేసి వేడి చేయాలి. తరువాత పన్నీర్ ముక్కల్ని ఎర్రగా వేయించి తీయాలి. తరువాత అదే పాన్ లో యాలకులు, లవంగాలు వేసి ఓ సెకను వేయించాలి. తరువాత సన్నగా తురిమిన వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి.

ఉల్లిపాయలు బంగారు వర్ణం లోకి మారిన తరువాత టొమాటో ముక్కలు వేసి 15 నిమిషాలు వేయించాలి. వేగిన తరువాత స్టవ్ మీద నుంచి దించి పుదీనా ఆకులు వేయాలి. చల్లారిన తరువాత ఈ మిశ్రమాన్ని మెత్తగా నూరుకోవాలి.

ఇప్పుడు పాన్ ను మళ్లీ స్టవ్ మీద పెట్టి రుబ్బిన మసాలా వేసి ఉప్పు సరి చూసి పన్నీర్ ముక్కలు వేసి తక్కువ మంట మీద 15 నిమిషాలు ఉడికించి దించాలి. దించే ముందు కొత్తి మీర చల్లితే సరి.

బఠాణీ పరోటా

కావలసినవి:

మైదాపిండి: 3 కప్పులు, నెయ్యి: 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు: అర టీ స్పూను, నెయ్యి: వేయించడానికి సరిపడా.

స్టఫింగ్ కోసం: ఉడికించిన పచ్చి బఠాణీలు: 2 కప్పులు, పచ్చిమిర్చి: 5, జీలకర్ర: టీ స్పూను, నెయ్యి: టేబుల్ స్పూను, ఉప్పు: తగినంత.24ruchi2

తయారుచేయు విదానం:

ముందుగా ఉడికించిన బఠాణీలను మెత్తగా మెదపాలి.

ఓ బాణలి లో కొద్దిగా నెయ్యి వేసి జీలకర్ర వేసి వేయించాలి.

తరవాత తురిమిన పచ్చిమిర్చి, మేదిపిన బఠాణీ ముద్ద వేయాలి. ఉప్పు కూడా వేసి ఓ నిమిషం ఉడికించి చల్లారనివ్వాలి.

మైదాలో ఉప్పు, నెయ్యి వేసి కలపాలి. తరవాత తగినన్ని నీళ్ళు పోసి మెత్తగా కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి.

ఇప్పుడు ఒక్క ఉండలో టేబుల్ స్పూను చొప్పున చల్లారిన బఠాణీ మిశ్రమాన్ని పెట్టి అంచుల్ని మూసేసి గుండ్రంగా వత్తాలి. తరవాత నాన్ స్టిక్ పాన్ మీద వేసి తగినంత నెయ్యి వేస్తూ రెండు వైపులా కాల్చి తీయాలి.

ఇలాగే అన్నీ చేస్తే బఠాణీ పరాటా రెడీ.